చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు కేజీ చికెన్ ధర 380 వరకు ఉండగా ఆదివారం కాస్త ధరలు దిగొచ్చాయి. పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.. స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 235 నుంచి రూ. 240 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 267 నుంచి రూ. 280 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.