VSP: ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అండర్ బ్రిడ్జిలో ఓ బస్సు అదుపుతప్పి ఇవాళ డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.