IPL వేలంలో కొనుగోలు చేసిన తర్వాత అనంతరం కావాలనే వైదొలిగితే ఆ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం సరిపోదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ కఠినంగా ఉండాలని తెలిపాడు. ప్రస్తుత శిక్షా విధానాన్ని పునఃపరిశీలించాలని అన్నాడు. ఇటీవల ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ ఈ సీజన్ నుంచి ఇలాగే వైదొలిగాడు. ఢిల్లీ జట్టు అతడిని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.