KRNL: ఆదోని శివారులోని ఇస్వీ రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకర గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ముప్పుగా మారాయి. రోజూ వాహనాలు ప్రమాదాలకు గురై పలువురు గాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన నిధులతో గుంతలు పూడ్చినా, నాణ్యత లోపంతో మళ్లీ పాత స్థితికి చేరాయి. ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.