కరీంనగర్ జడ్పీ కార్యాలయం ప్రాంగణంలో శనివారం డ్రైవర్లు, ప్రజలకు రోడ్డు భద్రత, చైల్డ్ హెల్ప్ లైన్ (1098)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ.. వాహనదారులు అతివేగాన్ని నియంత్రించాలని, సీట్ బెల్ట్ ధరించి రక్షణాత్మక డ్రైవింగ్ చేయాలని సూచించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ.. 1098 నంబర్‌కు తెలియజేయాలన్నారు.