MDCL: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో చెరువుల పరిశుభ్రతకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం 33 చెరువుల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి, 44 టన్నుల వ్యర్థాలను సేకరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా చెరువుల పరిరక్షణతో పాటు పర్యావరణ స్వచ్ఛతను మెరుగుపరచడమే లక్ష్యమన్నారు.