PDPL: ధర్మారం మండలం కిలా వనపర్తిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ సర్పంచ్ కనకయ్య ఆధ్వర్యంలో తీర్మానించారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించి, 2026-27లో చేపట్టే అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఉపసర్పంచ్ కావ్య, కార్యదర్శి మారుతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.