ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం వేసవి దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అనంతరం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.