TG: ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి తమ అభ్యంతరం లేదని, అయితే ప్రజల నిధులతో మాత్రం కట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. అయోధ్య రామాలయం కూడా ట్రస్ట్ నిధులతోనే నిర్మించారని గుర్తుచేశారు. BRSలో చీలికలు వస్తున్నాయని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. TG ప్రజలు చైతన్యవంతులని, BJPని ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.