RR: కడ్తాల్‌లోని వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 31న ఉత్సవాలు ముగుస్తాయని ప్రకటించారు. 3 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి అభిషేకం, కళ్యాణం, పల్లకీ సేవ వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.