MHBD: కొత్తగూడ మండలం కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుని పామాయిల్ తోట దగ్ధమైంది. బాధితుడు భూపతి తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. తోటలో నిప్పు పడటంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పామాయిల్ చెట్లతో పాటు లక్షల రూపాయల విలువైన డ్రిప్ పైపులు, ఇతర సాగు సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు.