ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సలార్ సత్తా చాటుతోంది. కలెక్షన్ల పరంగా 500 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అయితే.. వేరే దేశాల్లోను సలార్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. నేపాల్‌లో సలార్ క్రేజ్ చూస్తే షాక్ అవడం గ్యారెంటీ.
Salaar: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సలార్ మేనియా నడుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ రావడంతో.. పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో.. అంతకుమించి ప్రభాస్‌కు ఎలివేషన్స్ ఇచ్చాడు. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లో 400 కోట్ల గ్రాస్ రాబట్టిన సలార్.. ఐదు రోజుల్లో 500 కోట్ల మార్క్‌ను రీచ్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్లో రికార్డ్ రేంజ్ వసూళ్లను రాబడుతోంది. అయితే.. సలార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో.. నార్త్, సౌత్, ఓవర్సీస్.. అక్కడ ఇక్కడ అని కాదు అంతటా అదే క్రేజ్ కనిపిస్తోంది.
ముఖ్యంగా ఓవర్సీస్లో దుమ్ములేపుతోంది సలార్. కానీ నేపాల్‌లో సలార్ క్రేజ్ చూస్తే షాక్ అవాల్సిందే. నేపాల్‌లో ‘సలార్’ కోసం ఆడియెన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు.. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలో వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ గురించి మాట్లాడుతున్నారు.. గేట్లు దూకి థియేటర్లోకి వెళ్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కన నేపాల్‌లో సలార్, ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నేపాల్ అనే కాదు.. మిగతా కొన్ని దేశాల్లోను సలార్‌కు భారీ వసూళ్లు వస్తున్నాయి. ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం.. రెండో వీకెండ్ పూర్తి చేసే వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టనుంది. ఏదేమైనా.. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.