SRPT: లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఇరుపక్షాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ. లక్ష్మీ శారద తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టులో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్లో మొత్తం 1849 కేసులు పరిష్కారమయ్యాయని ఆమె తెలిపారు.