MDCL: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లలో బోడుప్పల్ సర్కిల్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం రూ. 61.23 కోట్ల డిమాండ్ ఉండగా, ఇప్పటికే 78 శాతానికి పైగా వసూళ్లు సాధించి అత్యుత్తమ పనితీరును కనబర్చింది. సమర్థవంతమైన ప్రణాళిక, అధికారులు తీసుకున్న కృషి వల్ల ఈ విజయం సాధ్యమైంది.