SDPT: వేసవికాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సరఫరాలో ఇబ్బంది కలగకుండా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. పట్టణాలు శుభ్రంగా ఉండాలని ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్య క్రమాలు నిర్వహించాలని సూచించారు.