VZM: గరివిడి (M) కొండపాలెం మేజర్ పంచాయతీ ఈవో వేణుగోపాలరావు ఆద్వర్యంలో సిబ్బంది నిన్న రాత్రి వేళ కూడా ఇంటి పన్ను వసూలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన తేదీ దగ్గర పడడంతో ఇంటింటికి వెళ్లి పన్నుల వసూలును వేగవంతం చేస్తున్నామన్నారు. పన్ను చెల్లించని ఇళ్లు యజమానుల వద్దకు వెళ్లి ఆన్లైన్ ద్వారా ఎలా చెల్లింపులు చేసుకోవాలో అవగాహన కల్పించామన్నారు.