PPM: అనాథ బాలల భద్రత మన అందరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ అధికారి సత్యనారాయణ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ తోట కనకదుర్గ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శనివారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్ తవిటినాయుడు పాల్గొన్నారు.