భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ అచ్చం తన తండ్రిలానే ఆడుతున్నారని, బ్యాటింగ్ స్టైల్ కూడా అలానే ఉందంటే నెట్టింట ఓ వీడియో ట్రెండ్ అవుతుంది.
Rahul Dravid: టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కుమారుడు సమిత్(Samit) కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనికి సంబంధించిన బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా బుధవారం జమ్మూకశ్మీర్‌తో జరిగిన ఆటలో అద్భుతమైన బ్యాటింగ్‌తో అభిమానుల మనసు కొల్లగొట్టాడు. 18 ఏళ్ల సమిత్ ఆట చూసిన ప్రతీ ఒక్కరు అచ్చం తండ్రిలానే బ్యాటింగ్(batting) చేస్తున్నాడని కొనియాడారు.
ఈ మ్యాచ్‌లో 98 పరుగులు చేసి కర్ణాటక జట్టు 130 పరుగుల తేడాతో విజయం సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. ఫలితంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుతమైన కవర్ డ్రైవ్ షాట్స్‌తో తన తండ్రి ద్రవిడ్‌ను తలపించాడంటూ అభిమానులు కామెంట్లతో సంబురాలు చేసుకున్నారు. సమిత్ ఫ్రంట్ఫుట్లు, కవర్ డ్రైవ్ షాట్స్ చూసి రాహుల్ ద్రవిడ్ ఆటను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Getting on to the front foot and playing these gorgeous looking cover drives is so very evident in his genes.
Early signs of seeing a confident looking young Jammy in the form of Samit Rahul Dravid. ❤️pic.twitter.com/8vTqlUMFXe