WGL: సంగెం మండలం నార్లవాయి గ్రామంలో నర్సమ్మ అనే వృద్ధురాలు పై శనివారం కోతులు దాడి చేశాయి. కిరాణా దుకాణానికి వెళ్తుండగా కోతుల గుంపు ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ప్రమాదంలో ఆమె కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన వృద్ధులను ఆసుపత్రికి తరలించారు. కోతుల బెడదను నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.