సత్యసాయి: హిందూపురంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం పద్మశ్రీ పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ సాహిత్యంలో ఆయన చేసిన కృషిని, జీవిత విశేషాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహశీల్దార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.