WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలోని భవానికుంట తండాలో జరుగుతున్న సమగ్ర భూ రీ సర్వే పనులను కలెక్టర్ సత్య శారద శనివారం పరిశీలించారు. భూ వివాదాల పరిష్కారం, యాజమాన్య హక్కుల నమోదు కోసం చేపట్టిన ఈ సర్వేలో భూముల సరిహద్దులు, కొలతలు, రికార్డులను పరిశీలించారు. భూ సర్వేలో మొత్తం 10,240 ఎకరాల్లో 6,379 ఎకరాల్లో సర్వే పూర్తయిందని కలెక్టర్ తెలిపారు.