SRPT: హజ్ యాత్రికుల ఆరోగ్య రక్షణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. DMHO డా. పెండెం వెంకటరమణ మాట్లాడుతూ.. యాత్రికులు తప్పనిసరిగా మెనింజైటీస్, ఇన్ఫ్లుయెంజా, పోలియో టీకాలు వేయించుకోవాలని సూచించారు. 40 మంది యాత్రికులకు టీకాలు వేయడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.