ATP: వైసీపీ ఈ సమాజానికి హానికరమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. అమరావతి ప్రజల రాజధాని అని, అది త్వరలోనే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో జగన్ అనేక మాటలు మార్చారని విమర్శించారు.