కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ శివారు బండారుపేట వద్ద శనివారం ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు, ఒక కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.