ADB: మున్సిపల్ పన్నులు చెల్లించని వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. ADB బస్టాండ్ పరిసరాల్లో శనివారం రెవెన్యూ అధికారి కళ్యాణ్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. మూడేళ్లుగా కమర్షియల్ టాక్స్ చెల్లించకుండా మొండికేస్తున్న ఒక వ్యాపార సముదాయాన్ని అధికారులు సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని, బకాయిలు ఉన్నవారు తక్షణమే చెల్లించాలన్నారు.