ఫోన్, కంప్యూటర్ వాడకంతో వచ్చే మెడ నొప్పి తగ్గాలంటే గంటకోసారి మెడను క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశలో నెమ్మదిగా తిప్పాలి. భుజాలను పైకి కిందకి కదల్చడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ రాకుండా ఉంటుంది. వెన్నుముక నిటారుగా ఉంచి సరైన భంగిమలో కూర్చోవాలి. వేడి/చల్లని కంప్రెస్లు, స్ట్రెచింగ్ వ్యాయామాలు, చిన్న దిండు వాడటం వంటి జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.