SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ, పొందూరు మండలాల్లోని 16 గ్రామాలకు త్రాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం రూ.4.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపారు. జల్ జీవన్ మిషన్ (JJM) పథకం కింద త్వరలో పనులు ప్రారంభించి గ్రామాల్లో నీటి కొరతను తగ్గించనున్నట్లు తెలిపారు.