SRPT: నాగారం పరిధిలోని ఎస్సారెస్పీ DBM 71 కాలువ ద్వారా సాగునీటి సరఫరా ఉధృతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం గణాంకాల ప్రకారం.. కాలువ ఫ్లూమ్ రీడింగ్ 2.60 మీటర్ల వద్ద ఉండగా, ఏకంగా 1,295 క్యూసెక్కుల భారీ నీటి ప్రవాహం దిగువకు వెళ్తుంది. SRSP జలాలు పుష్కలంగా పారుతుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.