AP: అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా తీర్మానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాధాన్యత, అమరావతి రైతుల త్యాగాలను ఆయన వివరించారు. ఈ తీర్మానంపై సభలోని అందరూ చర్చించి, బలపరచవలసిందిగా సభ్యులను విన్నవించారు.