HYD: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి సోమవారం మీడియాతో తెలిపారు. ఫైన్ లేకుండా మార్చి 10లోగా, రూ.1,000 ఫైన్‌తో మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.