TG: రాష్ట్ర బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించాలని బీసీ JAC ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బీసీ కులవృత్తుల వారికి రూ.10 లక్షల సబ్సిడీ రుణం అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 13 ఏళ్లలో ఒక్క బీసీ కుటుంబానికి కూడా సబ్సిడీ రుణం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.