కోనసీమ: రాయవరం మండలం చెల్లూరు చక్కెర కర్మాగారంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న 3 కూలింగ్ టవర్లలో 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎండవేడికి కెమికల్స్ తోడవడంతో సుమారు రూ. 3 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ జీఎం కోటేశ్వరరావు తెలిపారు. జిల్లా అగ్నిమాపక అధికారి పార్థసారథి, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ సత్య నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.