నెల్లూరు 47వ డివిజన్ పరిధిలోని నారాయణరావుపేటలో శుక్రవారం ఆటోలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. గమనించిన డివిజన్ ఇంఛార్జ్ డాక్టర్ గణేశ్ కుమార్, వెంటనే పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే 108 సిబ్బంది వచ్చేలోపే సదరు వ్యక్తి మృతి చెందారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.