ATP: రాష్ట్రంలో దురదృష్టకర ఘటనలు జరిగితే సాయం చేయకుండా రాజకీయం చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని MLA కాలువ శ్రీనివాసులు విమర్శించారు. రాయవరం బస్సు ప్రమాద బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. గతంలోనూ ఇలాగే తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు.