HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో క్రాస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో మల్లేష్ (56), సారయ్య (35)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ చేరుకుని 108 ఈఎంటీ స్వాతి, పైలెట్ ప్రవీణ్ కుమార్ గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.