BDK: ఆళ్లపల్లి మండలంలోని నడిమిగూడెం రైతులు తీవ్ర విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రోజుకు 20 గంటల వరకు ఉన్న త్రీఫేస్ విద్యుత్ సరఫరా, మార్చిలో కేవలం 2 నుంచి 3గంటలకు పడిపోవడంతో సాగు చేసిన మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. కొమరం బుచ్చిబాబు, పాయం సాయన్న సహా పలువురు రైతులు తమ పంటలు కళ్లముందే ఎండుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.