TPT: పిచ్చాటూరు మండలం అప్పంబట్టు బ్రిడ్జి కింద గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం ఎస్సై రాఘవేంద్ర తన సిబ్బందితో కలిసి నిర్వహించిన మెరుపు దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేయగా, మరో నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల నుంచి రూ.2,100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.