WGL: హంటర్ రోడ్ లోని భద్రకాళి బండ్ సమీపంలో గల గాయత్రీ దేవి ఆలయంలో శుక్రవారం ఉచిత భగవద్గీత, హనుమాన్ చాలీసా గ్రంధాలను పంపిణిచేశారు. జనసేన పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా జిల్లా నాయకులు డా.గోళ్ళ రాజేంద్ర ప్రసాద్, గడ్డం రాకేష్‌లు పాల్గొని నగరవాసులకు వీటిని అందజేశారు. సుమారు 500 మందికి వీటిని పంపిణీ చేసి, వాటి సారాంశాన్ని వివరించారు.