KMR: ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పడి అన్నారం యాదగిరి(53) మృతి చెందినట్లు ఎస్సై బొజ్జ మహేష్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. నాలుగేళ్ల క్రితం భార్య మరణించడంతో యాదగిరి మద్యం బానిసయ్యాడు. గురువారం మద్యం సేవించి కుమారులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి, రాత్రి పెద్దచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.