JGL: కథలాపూర్ మండలం చింతకుంట, భూషణరావుపేట, పెగ్గెర్ల గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చి, ప్రత్యేకంగా అలంకరించిన వేదికలపై ఆశీనులను చేశారు. అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గ్రామాల్లో ఆధ్యాత్మికత నెలకొంది.