యుద్ధం నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 107.97 డాలర్లుగా ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 86 పైసలు క్షీణించి 94.82 వద్ద జీవనకాల కనిష్టానికి చేరింది. అలాగే, కొంతకాలంగా నష్టాల్లోనే ఉన్న స్టాక్ మార్కెట్లు గత రెండు సెషన్లలో లాభపడ్డాయి. దీంతో ఇవాళ్టి ట్రేడింగ్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కూడా మార్కెట్ల పతనానికి ఓ కారణమైందని విశ్లేషకులు చెప్తున్నారు.