AP: మిషన్ కర్మయోగిలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక శిక్షణతో పాలనలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నిరూపించామని తెలిపారు. ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా అడుగులు వేయాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ‘సాధన సప్తాహం’ లెర్నింగ్ వీక్‌ను ఏపీ నిర్వహించబోతోందని ప్రకటించారు