NZB: ఎంపీగా ఉన్న సమయంలో తనను రైల్వే బ్రిడ్జి పనులపై ప్రశ్నించిన అరవింద్, గత ఏడేళ్లుగా ఏం చేశారో సమాధానం చెప్పాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి సాధనకే తమ కొత్త పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. పాలకులను ప్రశ్నించడం కూడా జనాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.