BPT: బెట్టింగ్ అనేది పెనుభూతంలాంటిదని, ఆశ చూపించి యువతను అధఃపాతాళానికి నెట్టేస్తుందని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించారు. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్‌ను అదునుగా చేసుకుని కొందరు చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌లకు ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉందన్నారు.