TG: BRS ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి పార్లమెంట్లో కీలక ప్రసంగం చేశారు. ‘దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతను నివారించండి. గల్ఫ్ కార్మికులను ఆదుకోండి’ అని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాబోయే మూడు నెలల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరారు.