TG: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో పలు హనుమాన్ ఆలయాలను సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.