WGL: మామునూర్ 4వ బెటాలియన్‌లోని ముత్యాలమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. MLA మాట్లాడుతూ.. ప్రజలందరూ శ్రీరాముని బాటలో నడుస్తూ కర్తవ్యపాలన, నిజాయితీ, సేవాభావంతో జీవించాలని సూచించారు.