విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్-1ను ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి శుక్రవారం సందర్శించారు. హాస్టల్లోని వసతులు, భోజన సదుపాయాలు, పరిశుభ్రతపై ఆయన పరిశీలించి, విద్యార్థినుల సమస్యలను తెలుసుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.