CTR: వెదురుకుప్పం మండలం క్లస్టర్ కన్వీనర్ బోడి రెడ్డి వెంకటరమణారెడ్డి ‘మై టీడీపీ’ యాప్లో 10,000 పాయింట్లు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన నిబద్ధతకు మెచ్చిన నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయం నుంచి TDP పార్టీ టోపీ, ప్రశంసా పత్రం అందజేశారు. మండలంలోని తెలుగు తమ్ముళ్లు వెంకటరమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.