NRPT: కోస్గి మండలం తోగాపూర్ గ్రామంలో శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.